తెలంగాణ

telangana

ETV Bharat / elections

ట్విట్టర్​లో ఎన్నికల హవా.. మోదీనే టాప్

భారత్​లో సార్వత్రిక సమరం ట్విట్టర్​లోనూ వేడి పుట్టించింది. నెల రోజులుగా ఎన్నికల ప్రస్తావనతో 4.56 కోట్ల ట్వీట్​లు నమోదయ్యాయి. జాతీయ భద్రతపై ఎక్కువ మంది మాట్లాడుకోగా.. నాయకుల్లో ప్రధాని నరేంద్రమోదీ గురించే అత్యధికులు చర్చించారని ట్విట్టర్​ యాజమాన్యం తెలిపింది.

By

Published : Apr 12, 2019, 1:21 AM IST

Updated : Apr 12, 2019, 8:19 AM IST

ట్విట్టర్​లో ఎన్నికల హవా.. మోదీనే టాప్

ట్విట్టర్​లో ఎన్నికల హవా.. మోదీనే టాప్

భారత్​.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎన్నికల ప్రక్రియ కూడా అత్యంత క్లిష్టమైనది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకించే భారత సార్వత్రిక సమరం ట్విట్టర్​లోనూ రికార్డులు నమోదు చేసింది. నెల రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రస్తావనతో 4.56 కోట్ల ట్వీట్లు నమోదయ్యాయని ట్విట్టర్​ యాజమాన్యం తెలిపింది.

ఎన్నికల విషయంలో ఎక్కువగా చర్చించిన అంశంగా జాతీయ భద్రత నిలిచింది. ఆ తర్వాత మతం, ఉద్యోగాలు, వ్యవసాయం, పన్నులు, వాణిజ్యం లాంటి అంశాలపైనా ఎక్కువగా చర్చించుకున్నారు. వ్యక్తుల విషయంలో ప్రధాని నరేంద్రమోదీ మొదటి స్థానంలో ఉన్నారని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది.

"తొలి దశ ఎన్నికల్లో భాగంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్​సభ స్థానాలకు గురువారం పోలింగ్​ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 4.56 కోట్ల​ ట్వీట్లు నమోదయ్యాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 12 లక్షల ట్వీట్లు నమోదయ్యాయి. "
-ట్విట్టర్

ట్విట్టర్​ వేదికగా రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజలకు చేరువయ్యారు. మోదీ తర్వాతి స్థానంలో ప్రముఖ నేతలు అమిత్​షా, యోగి ఆదిత్యనాథ్, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ నిలిచారు.

ఇదీ చూడండి: అగ్రస్థానంలో బంగాల్​... చివర్లో బిహార్!

Last Updated : Apr 12, 2019, 8:19 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details