తెలంగాణ

telangana

ETV Bharat / elections

'సార్వత్రిక సమరం'పై రికార్డు స్థాయి ట్వీట్లు..

2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నెటిజన్ల నుంచి రికార్డు స్థాయి ట్వీట్లు నమోదయ్యాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 396 మిలియన్ (39.6 కోట్లు) ట్వీట్లు చేశారు. గతంతో పోల్చుకుంటే ఈ సంఖ్య ఆరు రెట్లు ఎక్కువ.

By

Published : May 24, 2019, 7:20 AM IST

పాలిటిక్స్​

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సామాజిక మాధ్యమాల ప్రభావం చాలా ఉంది. ఎంతగా అంటే ఏ చిన్న విషయమైనా అంతర్జాలంలో పోస్ట్​ చేస్తూ తమ స్పందనను తెలియజేస్తుంటారు. ఎన్నికల​ గురించి మాట్లాడుకుంటూ ఎక్కువ ట్వీట్లు చేసింది ఈ లోక్​సభ ఎన్నికల్లోనే. జనవరి నుంచి ఇప్పటివరకు 396 మిలియన్ల (39.6కోట్లు) ట్వీట్లు.. నెటిజన్లు చేశారని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో 56 మిలియన్ల (5.6కోట్లు) ట్వీట్లు రాగా.. ఈ సారి అంతకు ఆరు రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి.

ఒక్క గురువారమే 3.2 మిలియన్ల (32లక్షల) ట్వీట్లు చేశారు ప్రజలు. ఇందులో ఆసక్తికర విషయమేంటంటే మూడో వంతు ట్వీట్లు మధ్యాహ్నం 3 నుంచి 4

గంటల ప్రాంతంలోనే చేశారు. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ.. భాజపా విజయంపై ట్విట్టర్​లో స్పందన తెలియజేశారు.

"మనం కలిసి పెరిగాం.. కలిసి వృద్ధి చేసుకుందాం... అందరం కలిసి భారత్​ను నిర్మించుకుందాం.. భారతదేశం మళ్లీ గెలిచింది" అంటూ మోదీ ట్వీటారు. ఈ పోస్టు​పై స్పందిస్తూ అప్పుడే 3.18 లక్షల రీ ట్వీట్లు చేశారు నెటిజన్లు.

ఈ లోక్​సభ ఎన్నికల్లో ట్విట్టర్లోఎక్కువ మందిప్రస్తావించిన పేర్లలో​ నరేంద్ర మోదీ తొలి స్థానంలో ఉన్నారు. జాతీయ భద్రత గురించి ఎక్కువ మంది ట్విట్టర్​లో మాట్లాడుకున్నారు. అనంతరం మతం, ఉద్యోగాలు, వ్యవసాయం, నోట్ల రద్దు లాంటి అంశాలకు ప్రతిస్పందించారు.

ABOUT THE AUTHOR

...view details