తెలంగాణ

telangana

ETV Bharat / elections

నాలుగో విడత పోలింగ్​ సాగిందిలా.... - undefined

నాలుగో విడత పోలింగ్​

By

Published : Apr 29, 2019, 6:40 AM IST

Updated : Apr 29, 2019, 6:04 PM IST

2019-04-29 17:35:19

ముగిసిన పోలింగ్​ సమయం... లైన్లలో ఉన్న వారికి అవకాశం

నాలుగో విడత సమయం 5 గంటలకు ముగిసింది. అయితే లైన్లలో ఉన్న వారికి ఓటు వేయటానికి అవకాశం ఉంది. బిహార్​లోని ముంగర్ నియోజకవర్గంలో 3 ​, బెగుసరాయ్​ నియోజకవర్గాలలో 3, దర్భంగా నియోజకవర్గంలో 2 బూత్​లలో ఉదయం పూట ఈవీఎంలు మొరాయించినందున పోలింగ్ సమయాన్ని పొడగించారు. 

2019-04-29 17:24:11

ఐదు గంట వరకు పోలింగ్​ సరళి...

9 రాష్ట్రాల్లో జరుగుతున్న నాలుగో విడత పోలింగ్​లో ఐదు గంటల వరకు 50.6 శాతం ఓటింగ్​ నమోదైంది. 

  • రాజస్థాన్​ 54.75 శాతం 
  • ఉత్తరప్రదేశ్​ 45.08 శాతం
  • పశ్చిమ్​బంగా 66.46 శాతం 
  • ఝార్ఖండ్​ 57.13 శాతం
  • బిహార్​ 44.33 శాతం 
  • జమ్ముకశ్మీర్​ 9.37 శాతం
  • మధ్యప్రదేశ్​ 57.77 శాతం
  • మహారాష్ట్ర 42.52 శాతం
  • ఒడిశా 53.61 శాతం
     

2019-04-29 17:02:29

ఓటేసిన సూపర్​ స్టార్​

ముంబయి బాంద్రాలోని ఓ పోలింగ్​ బూత్​లో బాలీవుడ్​ నటుడు షారుక్​ ఖాన్​, తన భార్య గౌరీ ఖాన్​తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2019-04-29 16:53:35

ఈసీకి బీజేడీ లేఖ

ఎన్నికల సంఘానికి ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్​ పార్టీ లేఖ రాసింది. నేడు పోలింగ్​ జరుగుతున్న జజ్​పూర్​ లోక్​సభ స్థానం పరిధిలోని బరీ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా కార్యకర్తలు 12 పోలింగ్​ బూత్​లను అదుపులోకి తీసుకున్నారంటూ లేఖలో పేర్కొంది. 

2019-04-29 16:12:47

బిహర్​లో 48.50 శాతం... మధ్యప్రదేశ్​లో 55.31 శాతం....

నాలుగు గంటల వరకు బిహార్​ 48.50 శాతం, మధ్యప్రదేశ్​లో 55.31 శాతం ఓటింగ్​ నమోదైంది.

2019-04-29 16:09:19

పశ్చిమ్​బంగాలో అత్యధికం.... జమ్ముకశ్మీర్​లో అత్యల్పం

మధ్యాహ్నం మూడు గంటల వరకు పశ్చిమ్​బంగాలో అత్యధికంగా 66.01 శాతం ఓటింగ్​ నమోదవగా... జమ్ముకశ్మీర్​లో అత్యల్పంగా 8.42 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-29 16:05:20

మూడు గంట వరకు పోలింగ్​ సరళి...

దేశవ్యాప్తంగా నాలుగో విడత జరుగుతున్న నియోజకవర్గాల్లో మూడు గంటల వరకు 49.53 శాతం ఓటింగ్​ నమోదైంది. 

  • రాజస్థాన్​ 54.16 శాతం 
  • ఉత్తరప్రదేశ్​ 44.16 శాతం
  • పశ్చిమ్​బంగా 66.01 శాతం 
  • ఝార్ఖండ్​ 56.37 శాతం
  • బిహార్​ 44.23 శాతం 
  • జమ్ముకశ్మీర్​ 8.42 శాతం
  • మధ్యప్రదేశ్​ 55.22 శాతం
  • మహారాష్ట్ర 41.15 శాతం
  • ఒడిశా 51.54 శాతం
     

2019-04-29 15:59:15

ఎండను లెక్కచేయని దివ్యాంగులు, వృద్ధులు

మహారాష్ట్రలో ఎండ వేడిని సైతం లెక్కచేయకుండా దివ్యాంగులు, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

2019-04-29 15:55:58

మహారాష్ట్రలో 42.03 శాతం

మహారాష్ట్రలో 3 గంటల వరకు 42.03 శాతం ఓటింగ్​ నమోదైంది. 

2019-04-29 15:50:35

పశ్చిమ్​బంగా 66 శాతం ఓటింగ్​

పశ్చిమ్​బంగాలో 3గంటల వరకు  66 శాతం ఓటింగ్​ నమోదైంది. 

2019-04-29 15:43:31

భాజపాపై ఎన్నికల సంఘానికి టీఎంసీ లేఖ

పశ్చిమబంగాలో భారతీయ జనతా పార్టీ, కేంద్ర భద్రతా బలగాల వ్యవహరించిన తీరుపై ఆరోపణలు చేస్తూ ఎన్నికల సంఘానికి(ఈసీ) లేఖ రాసింది తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ)

"పశ్చిమ్​బంగాలో కేంద్ర భద్రత బలగాలు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించాయి. భాజపా కార్యకర్తలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. భాజపా కార్యకర్తల సూచన మేరకు కేంద్ర బలగాలు నడుచుకున్న ఘటనలూ ఉన్నాయి. "  
     -  ఎన్నికల సంఘానికి టీఎంసీ లేఖ. 

2019-04-29 15:35:46

పశ్చిమ్​బంగాలో హింసపై ఈసీకి భాజపా...

కేంద్ర మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, విజయ్​ గోయల్​, అనిల్​ బలూనీలతో కూడిన భారతీయ జనతా పార్టీ బృందం ఎన్నికల సంఘంతో సమావేశమైంది.

" నరేంద్రమోదీ, అమిత్​షాలపై రాహుల్​గాంధీ ఆరోపణలు వ్యతిరేకతను వ్యక్త పరిచాం. ఆయన వ్యాఖ్యలు నిరాధారంతో పాటు ఎన్నికల నియామావళికి విరుద్ధం. పశ్చిమబంగాలో హింసపై గురించి చర్చించాం. పారదర్శక ఎన్నికల జరిగేందుకు  కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలని కోరాం."
                     - నఖ్వీ, కేంద్ర మంత్రి. 
 

2019-04-29 15:33:13

ఉత్తరప్రదేశ్​లో 43.9 శాతం

ఉత్తరప్రదేశ్​లో 3 గంటల వరకు 43.9 శాతం ఓటింగ్​ నమోదైంది. 

2019-04-29 15:22:04

ఒంటి గంట వరకు పోలింగ్​ సరళి...

నాలుగో విడతలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు దేశవ్యాప్తంగా 38.28 శాతం ఓటింగ్​ నమోదైంది. 

  • రాజస్థాన్​ 44.51 శాతం 
  • ఉత్తరప్రదేశ్​ 34.19 శాతం
  • పశ్చిమ్​బంగా 52.37 శాతం 
  • ఝార్ఖండ్​ 44.90 శాతం
  • బిహార్​ 37.71 శాతం 
  • జమ్ముకశ్మీర్​ 37.71 శాతం
  • మధ్యప్రదేశ్​ 43.38 శాతం
  • మహారాష్ట్ర 29.18 శాతం
  • ఒడిశా 35.79 శాతం
     

2019-04-29 14:06:54

కుటుంబసమేతంగా సచిన్​

ముంబయి బాంద్రాలోని ఓ పోలింగ్​ కేంద్రంలో సచిన్ తెందుల్కర్​, ఆయన భార్య అంజలీ, కొడుకు అర్జున్​ తెందుల్కర్​, కూతురు సారా తెందుల్కర్​లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2019-04-29 13:57:42

ఓటేసిన తారలు...

ముంబయిలో బాలీవుడ్​ తారలు సల్మాన్​ఖాన్​, కరీనాకపూర్​, నగ్మాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-29 13:52:55

ఓటు హక్కును వినియోగించుకున్న అమితాబ్​ బచ్చన్​ కుటుంబం...

ముంబయిలో అమితాబ్​ బచ్చన్​తో పాటు ఆయన భార్య జయా బచ్చన్​, కొడుకు అభిషేక్​ బచన్​, కోడలు ఐశ్వర్యరాయ్​లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.  
 

2019-04-29 13:21:21

మధ్య ప్రదేశ్​లో 31.59 శాతం, రాజస్థాన్​లో 45 శాతం...

1 గంట వరకు మధ్యప్రదేశ్​లో 31.59 శాతం, రాజస్థాన్​లో 45 శాతం పోలింగ్​ జరిగింది. 

2019-04-29 13:12:12

హేమామాలిని ఓటు హక్కు వినియోగం..

ఉత్తరప్రదేశ్​లోని మధుర నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, సినీ నటి హేమామాలిని కూతుళ్లతో పాటుగా ముంబయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

2019-04-29 13:00:03

జమ్ములో బూత్​ల వద్ద రాళ్లు విసిరిన ఘటనలు.

జమ్ముకశ్మీర్​లో పోలింగ్​ జరుగుతున్న కుల్గాం జిలాలో పలు పోలింగ్​ బూత్​ల​ వద్ద రాళ్లు రువ్విన ఘటనలు నమోదయ్యాయి. 

2019-04-29 12:53:18

కుటుంబసమేతంగా  ఓటేసిన 'ఉద్ధవ్​ ఠాక్రే'

ముంబయి గాంధీనగర్​లోని ఓ పోలింగ్​ బూత్​లో శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే, ఆయన కుటుంబసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తర ముంబయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పునమ్​ మహాజన్​ వీరితో పాటు ఉన్నారు. 

2019-04-29 12:42:20

తృణమూల్​ కార్యకర్తల నిరసన...

పశ్చిమ్​బంగా బీర్​భూమ్​ జిల్లాలో ననూర్​ ప్రాంతంలో తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్ర భద్రతా బలగాలు లేకపోయినప్పటికీ పోలింగ్​ జరిపించాలన్న వీళ్ల వినతిని... భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరస్కరించటమే దీనికి కారణం.

2019-04-29 12:17:49

"అభివృద్ధి అనే వైరస్​ ప్రభావం ప్రతిఒక్కరిపై ఉంటుంది"

మహింద్ర గ్రూప్​ ఛైర్మన్​ అనంద్​ మహింద్ర ఓటు హక్కును ముంబయి మలబార్​ హిల్ ప్రాంతంలోని ఓ బూత్​లో  ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం తన దైన శైలిలో స్పందించారు. 

"అభివృద్ధి, ఆర్థికవృద్ధి అనే వైరస్​ల ప్రభావం అందరిపై ఉంటోంది. సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా....దేశాభివృద్ధి, ఆర్థికవృద్ధి దిశగా పనిచేయాలి "

                                                                                                      - ఆనంద్​ మహింద్ర

2019-04-29 11:57:07

11 గంటల వరకు పోలింగ్​ తీరు....

  • రాజస్థాన్​ 29.19 శాతం 
  • ఉత్తరప్రదేశ్​ 21.18 శాతం
  • పశ్చిమ్​బంగా 35.10 శాతం 
  • ఝార్ఖండ్​ 29.21 శాతం
  • బిహార్​ 18.26 శాతం 
  • జమ్ముకశ్మీర్​ 3.74 శాతం
  • మధ్యప్రదేశ్​ 26.62 శాతం
  • మహారాష్ట్ర 16.14 శాతం
  • ఒడిశా 19.67 శాతం

2019-04-29 11:48:19

ఓటేసిన కంగనా....

ముంబయి ఖర్​ ప్రాంతంలోని ఓ పోలింగ్​ బూత్​లో బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-29 11:38:59

వివిధ రాష్ట్రాల్లో 11 గంటల వరకు పోలింగ్​ సరళి...

 11 గంటల వరకు జార్ఖండ్​లో 29.21 శాతం, బిహార్​లో 17.07 శాతం, ఉత్తరప్రదేశ్​లో 21.18 శాతం, ఒడిశా 17 శాతం, పశ్చిమ్​బంగాలో 34.71 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-29 11:14:25

అనుపమ్​ ఖేర్​...

అనుపమ్​ ఖేర్​...

ముంబయి జుహులోని ఓ పోలింగ్​ బూత్​లో బాలీవుడ్​ నటుడు అనుపమ్​ ఖేర్​ ఓటేశారు. 

2019-04-29 11:12:31

రాజస్థాన్​ 14 శాతం, బిహార్​ 15.06 శాతం

11 గంటల వరకు రాజస్థాన్​లో 14 శాతం, బిహార్​లో 15.06 శాతం, మధ్యప్రదేశ్​లో 15.03 శాతం ఓటింగ్​ నమోదైంది. 

2019-04-29 11:02:19

సోనాలీ బింద్రే...

సోనాలీ బింద్రే

ముంబయిలో నటీ సోనాలీ బింద్రే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యం అనేది ఒక బహుమతని, దానిని కాపాడుకోవటం అవసరమని అన్నారు. 

2019-04-29 10:55:53

కుటుంబీకులు సహాయంతో....

ముంబయిలో ఒక మహిళను కుర్చీలో కూర్చోబెట్టుకొనీ కట్టెల సహాయంతో... కుటుంబీకులు, ఎన్నికల సిబ్బంది పోలింగ్​ బూత్​కు తీసుకొచ్చారు. 

2019-04-29 10:41:10

మొదటిసారి ఓటింగ్​లో ప్రజలు...

జార్ఖండ్​లోని పలాము నియోజకవర్గంలోని నక్సల్స్​ ప్రభావిత ప్రాంతం జగోది. ఇక్కడ మొదటి సారిగా ప్రజలు ఓటింగ్​లో పాల్గొంటున్నారు. 

2019-04-29 10:35:09

పశ్చిమ్​బంగాలో హింసపై ఈసీకి భాజపా...

పశ్చిమబంగాలో పోలింగ్​ సమయంలో జరిగిన హింసపై ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, విజయ్​ గోయల్​, అనిల్​ బలూనీలతో కూడిన భారతీయ జనతా పార్టీ బృందం ఎన్నికల సంఘంతో ఇవాళ భేటీ కానున్నాను. 

2019-04-29 10:23:24

హెచ్​డీఎఫ్​సీ ఛైర్మన్​

ముంబయిలో పెద్దర్​ రోడ్డు వద్ద ఓ పోలింగ్​ బూత్​లో హెచ్​డీఎఫ్​సీ ఛైర్మన్​ దీపక్​ పరేఖ్​ ఓటేశారు. 

2019-04-29 10:19:40

సతీసమేతంగా...

బాలీవుడ్​ నటుడు అమీర్​ఖాన్​ సతీసమేతంగా ముంబయి బాంద్రలోని సెంట్​ అన్నేస్​ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-29 10:17:43

దేశవ్యాప్తంగా 10.27 శాతం ఓటింగ్​

నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో 9 గంటల వరకు 10.27 శాతం ఓటింగ్​ నమోదైంది. 

9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో పోలింగ్​...

  • రాజస్థాన్​ 11.20 శాతం 
  • ఉత్తరప్రదేశ్​ 9.01 శాతం
  • పశ్చిమ్​బంగా 16.89 శాతం 
  • జార్ఖండ్​ 12.00 శాతం
  • బిహార్​ 10.76 శాతం 
  • జమ్ముకశ్మీర్​ 0.61 శాతం
  • మధ్యప్రదేశ్​ 11.11 శాతం
  • ఒడిశా 8.34 శాతం
     

2019-04-29 10:08:45

ముంబయిలో అజయ్​ దేవగణ్​, కాజోల్​

 ముంబయి జుహులో బాలీవుడ్​ నటీ నటులు అజయ్​ దేవగణ్​​, కాజోల్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2019-04-29 09:49:48

పశ్చిమ్​బంగాలో 16.90 శాతం....

పశ్చిమ్​బంగాలో 9 గంటల వరకు 16.90 శాతం ఓటింగ్​ నమోదైంది. మహారాష్ట్రలో 6.82 శాతం, మధ్య ప్రదేశ్​లో 11.11 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-29 09:45:02

ముంబయిలో మాధురి దీక్షిత్​....

బాలీవుడ్​ నటి మాధురి దీక్షిత్​ ముంబయి జుహులోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-29 09:30:40

పశ్చిమ్​బంగాలో ఘర్షణలు...

పశ్చిమబంగాలో ఘర్షణలు

పశ్చిమ్​బంగా అసన్​సోల్​లోని ఓ పోలింగ్​ బూత్​ వద్ద తృణమూల్​ కాంగ్రెస్​, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బాబూల్​ సుప్రీయో కారు ధ్వంసమైంది. 

2019-04-29 09:12:12

శరద్​ పవార్​...

నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు శరద్​ పవార్​ ముంబయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-29 08:54:41

ముంబయిలో ఊర్మిళ మాతోంద్కర్​..

ముంబయి బాంద్రలోని ఓ పోలింగ్​ బూత్​లో బాలీవుడ్​ నటి ఊర్మిళ మాతోంద్కర్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు ముంబయి నుంచి కాంగ్రెస్​ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈ నటి. 

2019-04-29 08:33:44

బంగాల్​ జమువాలో బహిష్కరణ

పశ్చిమ్​బంగ జమువాలోని పోలింగ్​ బూత్​ నెం. 222, 226లలో గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరించారు. కేంద్ర బలగాల భద్రత లేకపోవడమే కారణంగా ఓటర్లు నిరసన తెలుపుతున్నారు. ప్రజల ఆందోళనలతో ఓటింగ్​ నిలిపివేశారు అధికారులు. 

2019-04-29 08:30:01

ఛింద్వాడాలో కమల్​నాథ్​....

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​ నాథ్​.. ఛింద్వాడాలోని శికార్​పుర్​ పోలింగ్​ బూత్​ నెం. 17లో ఓటు వినియోగించుకున్నారు. 

2019-04-29 08:24:58

ముంబయిలో పరేశ్​ రావల్​...

భాజపా సిట్టింగ్​ ఎంపీ పరేశ్​ రావల్​ కుటుంబ సమేతంగా జమ్నా బాయి పాఠశాల పోలింగ్​ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2019-04-29 07:59:48

రేసుగుర్రం 'మద్దాలి శివారెడ్డి '.....

రేసుగుర్రం సినిమాలో ప్రతినాయకుడు మద్దాలి శివారెడ్డి పాత్రలో ఆకట్టుకున్న రవి కిషన్​ ముంబయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్​ గోరఖ్​పూర్​ నుంచి ఈయన లోక్​సభలో బరిలో ఉన్నారు

2019-04-29 07:55:57

బాలీవుడ్​ నటి రేఖ...

ముంబయి బాంద్రలోని 283 పోలింగ్​ బూత్​లో బాలీవుడ్​ సీనియర్​ నటి రేఖ ఓటేశారు. 

2019-04-29 07:53:18

ఆర్బీఐ గవర్నర్​...

ముంబయిలోని ఓ పోలింగ్​ బూత్​లో రిజర్వు బ్యాంకు గవర్నర్​ శక్తి కాంత దాస్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-29 07:38:49

ఈవీఎంల మొరాయింపు

అక్కడక్కడ ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల మొరాయించటం వల్ల పోలింగ్​కు అంతరాయం కలుగుతోంది. అప్రమత్తంగా ఉన్న అధికారులు సమస్యను పరిష్కరిస్తున్నారు. 

2019-04-29 07:29:04

వసుంధర రాజే ఓటు హక్కు వినియోగం

​రాజస్థాన్​ ఝాలావాడ్​లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఓటేశారు. 

2019-04-29 07:20:32

ఓటు హక్కు వినియోగించుకున్న అనిల్​ అంబానీ

అనిల్​ అంబానీ ముంబయిలోని  జీడీ సోమని పాఠశాల బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2019-04-29 07:12:58

ఓటేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​

బిహార్​కు చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-29 07:02:26

ప్రారంభమైన పోలింగ్​

నాలుగో విడత పోలింగ్​ ప్రారంభమైంది. ప్రజలు బూత్​లకు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. 

2019-04-29 06:54:44

రికార్డులు బద్దలుకొడతారని ఆశిస్తున్నాను: మోదీ

ఈ రోజు భారీ స్థాయిలో ప్రజలు ఓటింగ్​లో పాల్గొని క్రితం మూడు విడతల్లో పోలింగ్​ శాతం రికార్డులను బద్దలుకొడతారని ఆశిస్తున్నాను. యువ ఓటర్లు పోలింగ్​ బూత్​కు వెళ్లి ఓటేయాలని కోరుతున్నాను - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి. 

2019-04-29 06:53:18

కట్టుదిట్టమైన భద్రత

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించింది. 2 లక్షల 70 వేల మంది పారామిలటరీ బలగాలు, 20 లక్షల మంది వివిధ రాష్ట్రాల పోలీసులు, హోంగార్డులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎన్నికల సంఘం కోరిన మేరకు 2710 కంపెనీల పారామిలటరీ బలగాలను లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పంపినట్లు వివరించింది. పోలింగ్​ కేంద్రాల్లో సీసీ కెమెరా నిఘాను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.
 

2019-04-29 06:46:34

నాలుగో దశ సార్వత్రిక సమరం

నాలుగో దశ సార్వత్రిక సమరం

నేటి నాలుగో విడత పోలింగ్​కు 71 నియోజకవర్గాల నుంచి 943 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 98మంది మహిళలు.
 

2019-04-29 06:34:46

కాసేపట్లో నాలుగో విడత పోలింగ్​

నాలుగో దశ సార్వత్రిక సమరం

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్​ కాసేపట్లో ప్రారంభం కానుంది. 9 రాష్ట్రాల్లోని 71 లోక్​సభ నియోజకవర్గాల్లో ఓటింగ్​ జరగనుంది. వీటితో పాటు జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​ నియోజకవర్గంలోని కుల్గాం జిల్లాలోనూ ఓటింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. భద్రతా కారణాల దృష్ట్యా అనంత్​నాగ్​కు 3 దశల్లో పోలింగ్ ఏర్పాటు చేసింది. 71 స్థానాల్లో 12.73 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం లక్షా 37వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఈసీ. 

Last Updated : Apr 29, 2019, 6:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details