రెండో విడత ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులపై ఏడీఆర్ నివేదిక ఏప్రిల్ 18న జరగబోయే సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో పోటీ పడే అభ్యర్థుల్లో 16 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 1644 మంది అభ్యర్థులకు గాను 1590 మంది అభ్యర్థుల ప్రమాణపత్రాలను పరిశీలించి ఈమేరకు నివేదిక రూపొందించింది ఏడీఆర్.
2వ దశకు పోటీపడుతున్నవారిలో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 167 మంది అంటే 11% అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
ఏ పార్టీలో ఎంతమంది?
పార్టీ | అభ్యర్థులు | క్రిమినల్ కేసులు | తీవ్రమైనవి |
భాజపా | 51 | 16 (31%) | 10(20%) |
కాంగ్రెస్ | 53 | 23 (43%) | 17 (32%) |
బీఎస్పీ | 80 | 16 (20%) | 10 (13%) |
అన్నాడీఎంకే | 22 | 3 (14%) | 3 (14%) |
డీఎంకే | 24 | 11 (46%) | 7 (29%) |
శివసేన | 11 | 4 (36%) | 1 (9%) |
అభ్యర్థుల్లో కోటీశ్వరులు..
రెండో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 423 మంది(27%) తమకు రూ.కోటికి మించి ఆస్తులున్నట్లు చూపారు. పోటీ పడుతున్న అభ్యర్థుల సగటు ఆస్తి రూ.3.90 కోట్లు.
అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కోటీశ్వరులే.
పార్టీ | అభ్యర్థులు | కోటీశ్వరులు |
భాజపా | 51 | 45 (88%) |
కాంగ్రెస్ | 53 | 46 (87%) |
బీఎస్పీ | 80 | 21 (26%) |
అన్నాడీఎంకే | 22 | 22 (100%) |
డీఎంకే | 24 | 23 (96%) |