18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి విడత ఎన్నికల అంకం ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తొలుత జోరుగా ప్రారంభమైన ఓటింగ్... తర్వాత మందకొడిగా సాగింది. పశ్చిమ్‌బంగ, త్రిపురలో అత్యధికంగా ఓటు వినియోగించుకోవడానికి తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉప అధికారి ఉమేశ్ సిన్హా వెల్లడించారు.
అగ్రస్థానంలో బంగాల్... చివర్లో బిహార్! - ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భారత ఎన్నికల ప్రక్రియ తొలి విడత ముగిసింది. క్యూలో నిల్చున్న ఓటర్లకూ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 91 లోక్‌సభ స్థానాలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ పూర్తయింది. మరో 6 దశల పోలింగ్ ముగిసిన అనంతరం మే 23న ఫలితాలు వెల్లడించనున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలు
మరికొద్ది గంటల్లో మొత్తం పోలింగ్ శాతంపై స్పష్టత రానుంది. ఎన్నికల యంత్రాంగం సమష్టి కృషితో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించింది ఈసీ. కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తల పిలుపుతో ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటును తమ బాధ్యతగా నిర్వర్తించుకున్నారు.
వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ సరళి ఇలా ఉంది.
రాష్ట్రం | పోలింగ్ శాతం |
పశ్చిమ్‌బంగ | 81 |
త్రిపుర | 81.8 |
మణిపుర్ | 78.2 |
నాగాలాండ్ | 78 |
అసోం | 68 |
మిజోరం | 60 |
మేఘాలయ | 67.16 |
తెలంగాణ | 61 |
ఉత్తరాఖండ్ | 57.85 |
లక్షద్వీప్ | 51.25 |
ఆంధ్రప్రదేశ్ | 70.67 |
అరుణాచల్ ప్రదేశ్ | 66 |
సిక్కిం | 69 |
జమ్ము కశ్మీర్ | 54.49 |
బిహార్ | 50 |
Last Updated : Apr 11, 2019, 11:07 PM IST