తెలంగాణ

telangana

ETV Bharat / crime

జోగిని శ్యామలతో పాటు మరో 15మందిపై జీరో ఎఫ్​ఐఆర్​ - జోగిని శ్యామలపై జీరో ఎఫ్ఐఆర్

జోగిని శ్యామలతోపాటు మరో 15 మందిపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదైంది. అనంతరం కేసును మెదక్‌ జిల్లా పాపన్నపేట ఠాణాకు బదిలీ చేశారు. జ్యోగిని శ్యామలతోపాటు మరో 15మంది పురుషులు తనను వివస్త్రను చేసి చిత్రహింసలకు గురిచేశారంటూ... గాంధీనగర్​కు చెందిన మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

zero-fir-case-file-on-jogini-shyamala-in-panjagutta-police-station
జోగిని శ్యామలతో పాటు మరో 15మందిపై జీరో ఎఫ్​ఐఆర్​

By

Published : Mar 15, 2021, 7:42 PM IST

ఈ నెల 12న సాయంత్రం గాంధీనగర్​కు చెందిన మహిళ, ఆమె తల్లితో కలిసి మెదక్ జిల్లాలోని ఏడుపాయల నాగసాన్‌పల్లిలోని వనదుర్గ భవానీ దేవి ఆలయానికి వెళ్లింది. అక్కడ దర్శనం అనంతరం జోగిని శ్యామలను కలిశామని మహిళ పేర్కొంది. శ్యామల ఆమెకు చెందిన ఓ గదిలో ఆశ్రయం కల్పించిందని తెలిపింది.

అప్పటికే ఆ గదిలో మరో 15మంది పురుషులున్నారని... వారితో కలిసి శ్యామల తనను మద్యం సేవించాలని బలవంతం చేశారని మహిళ ఆరోపించింది. అనంతరం వివస్త్రను చేసి చిత్రహింసలకు గురిచేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పాపన్నపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగినందున పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను ఆ ఠాణాకు బదిలీ చేశారు.

ఇదీ చూడండి:మహేశ్ బ్యాంక్ ఛైర్మన్​తో పాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు

ABOUT THE AUTHOR

...view details