YCP SARPANCH ATTACK ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ విద్యుత్‌శాఖ ఏఈపై.. నెరిమెట్ల వైకాపా సర్పంచ్ యోగేందర్‌రెడ్డి దాడికి పాల్పడ్డాడు. విద్యుత్ బకాయిలు చెల్లించని వారి విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తుండగా ఏఈకి ఫోన్ చేసి దుర్భాషలాడిన సర్పంచ్.. తమ వారికి సంబంధించిన ఇళ్లకు సర్వీసు తొలగించవద్దంటూ హెచ్చరించాడు. దీంతో.. ఏఈ ఫోన్ కట్ చేసి, తన పని తాను చేసుకుంటున్నాడు.
తన మాట వినలేదని విద్యుత్ శాఖ ఏఈపై సర్పంచ్ వీరంగం - ఏపీ ముఖ్యవార్తలు
YCP SARPANCH ATTACK విద్యుత్ శాఖ ఏఈని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సర్పంచ్ దుర్భాషలాడాడు. తమ వారికి చెందిన విద్యుత్ కనెక్షన్లు తొలగించవద్దని హెచ్చరించాడు. అయితే సర్పంచ్ మాటలను ఏఈ లెక్కచేయకపోవడంతో కోపంతో ఊగిపోయిన సర్పంచ్ సదరు అధికారిపై దాడి చేశాడు.
ysrcp-sarpanch-attack-on-electricity-department-ae-in-anantapur
తన మాటను ఏఈ పట్టించుకోకపోవటంతో ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్ యోగేందర్‌రెడ్డి.. రాయంపల్లిలో ఉన్న ఏఈ గురుమూర్తి వద్దకు వెళ్లి, ఆయనపై దాడి చేశాడు. కాలుతో తన్నడంతోపాటు నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. భయపడిపోయిన గురుమూర్తి పక్కనే ఉన్న సచివాలయంలోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి గురుమూర్తిని కాపాడారు.
ఇవీ చదవండి: