తెలంగాణ

telangana

ETV Bharat / crime

AP POLICE ఛీ, పాడు పనికి పోలీస్ స్టేషన్​నే వాడుకున్నాడా ఏఎస్సై - ఏపీ పోలీస్​

AP POLICE ఎవరికి దొరక్కుండా ఉండేందుకు, పోలీస్ స్టేషన్​ను మించిన సేఫ్ ప్లేస్ ఏముంటుందిలే అని అనుకున్నాడేమో ఆ ఏఎస్సై. కాని రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. కారణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

ap police
ఏపీ పోలీసు

By

Published : Aug 29, 2022, 2:33 PM IST

AP POLICE: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడని సామెత ఎక్కడ చదివి ఉంటాడే ఏమోగానీ ఈ పోలీసు దానిని ఆచరణలో పెడుతూ చివరికీ అడ్డంగా దొరికిపోయాడు. పోలీసోడికి పోలీస్​స్టేషన్​ ఆలయం లాంటిది. అటువంటి పవిత్రమైన ప్రదేశంలో అటువంటి పనులు చేస్తే ఇంకా సమాజం ఎటువైపు అడుగులు వేస్తోంది. న్యాయం చెప్పాల్సిన వ్యక్తే అలా చెడ్డ పనులు చేస్తే ఇంక ఏమి అనుకోవాలి. అటువంటి పోలీసుకి సమాజమే బుద్ధి చెప్పాలి అన్నట్లు అలానే జరిగింది. అతనిని స్థానిక యువతే ఏఎస్సై అప్పారావును రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా రావి కామతం మండలం కొత్త కోట పోలీస్ స్టేషన్​లో ఈ దారుణం జరిగింది.

పోలీస్​స్టేషన్​నే దుకాణాన్ని మార్చి పడేశాడు. ఆదివారం రాత్రి గం.11లకు ఏఎస్​ఐ మద్యం సేవించి స్టేషన్​లోనే మహిళతో ఉండటాన్ని స్థానికంగా ఉన్న కొందరు యువకులు పట్టుకున్నారు. అతను చేసిన ఘనకార్యాన్ని వెంటనే స్ధానిక సి.ఐ. సయ్యద్ అలీకి తెలియజేశారు. సిఐ హుటాహుటిన ఏఎస్​ఐ రూమ్​కు చేరుకుని చూసేసరి అతగాడి బాగోతం బయటపడింది. విషయం బహిరంగం కావడంతో, చేసేదేం లేక క్షమించండంటూ సీఐ కాళ్ల మీద పడ్డాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details