ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో మరోసారి బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)లు జోరందుకుంటున్నాయి. ఒకప్పుడు గదులు అద్దెకు తీసుకుని బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)లు నిర్వహించేవారు. నేడు చరవాణి ద్వారా పందేలు కాసే పరిస్థితి వచ్చింది. మహబూబ్‌నగర్, జడ్చర్ల, వనపర్తి, కోస్గి, నారాయణపేట, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, గద్వాల, అయిజ తదితర పట్టణాల్లో బెట్టింగ్ ఏజెంట్లు తమ వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. జడ్చర్లలో ఓ వ్యక్తి పందేలతో అప్పుల పాలై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
హోటళ్ల వద్ద గాలం..
ఉమ్మడి జిల్లాలో బెట్టింగ్(IPL BETTING IN TELANGANA) ఏజెంట్లు పట్టణాల్లోని మార్కెట్లు, హోటళ్లు, టీ కొట్టుల వద్ద యువతకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని నియంత్రించే వ్యక్తిని డాన్ అంటారని, వారు ఎవరు? ఎక్కడ ఉంటారు? వారి నేపథ్యం ఏజెంట్లకు కూడా తెలియదని సమాచారం. కర్నూలు, రాయచూరు, హైదరాబాద్ ప్రాంత డాన్‌ల ద్వారా ఉమ్మడి జిల్లా ఏజెంట్లు వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలిసింది. మట్కా దందా నిర్వహించేవారే క్రికెట్ పందేల్లోనూ కీలక భూమిక పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు గంట ముందు నుంచే వాట్సప్ గ్రూప్‌ల ద్వారా బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)లు ప్రారంభమవుతుంటాయి. అందుకోసం యువత కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసుకుని, ఆ నంబరు ద్వారా ఏజెంట్లను సంప్రదిస్తూ బెట్టింగ్ కాస్తుంటారు. టాస్ వేసినప్పటి నుంచి చివరి ఓవర్ వరకు ఈ ప్రక్రియ సాగుతుందని సమాచారం.
అంతా యువకులే..
మూడేళ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లిలో ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)జరుగుతుండగా పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడు ఇక్కడ గదిని అద్దెకు తీసుకుని వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు. పందేలు కాసేవారందరూ యువకులే కావడం గమనార్హం.
గతేడాది వనపర్తిలో 16 మంది యువకులు ఓ ఇంటి మిద్దెపై చరవాణిలో క్రికెట్ పందేలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
రెండేళ్ల కిందట జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో ముగ్గురు వ్యక్తులు బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)నిర్వహిస్తుండగా స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఏజెంట్లు కూడా ఉన్నారు. గద్వాల పట్టణంలో కూడా ఓ లాడ్జిలో క్రికెటు పందేలు నిర్వహిస్తూ ఏజెంట్లు పోలీసులకు పట్టుబడ్డారు.
కన్నవారికి కన్నీరు మిగిల్చారు..