భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కాలనీకి చెందిన ఓ మహిళ(56) కొంత కాలం క్రితం మహమ్మారి బారిన పడింది. కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది.
Funeral: కరోనా మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించిన యువత - corona deaths in bhadradri kothagudem district
కరోనాతో మృతి చెందిన మహిళకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కొందరు యువకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురంలో సంప్రదాయబద్దంగా ఆమెకు దహనసంస్కారాలు జరిపించారు.
అంత్యక్రియలు, కరోనా మృతురాలికి అంత్యక్రియలు, కొత్తగూడెం జిల్లాలో కరోనా మరణాలు
విషయం తెలుసుకున్న గ్రామ యువత ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. మృతదేహాన్ని ఊరికి తీసుకొచ్చే వరకు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అనంతరం సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్ వంటి కష్టకాలంలో అండగా నిలిచిన ఆ యువకులను గ్రామస్థులు అభినందించారు.