నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన బలవంత్ అనే యువకుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని గురువారం మహిళ తరపు బంధువులు అతడిపై దాడి చేశారు. మనస్తాపం చెందిన బలవంత్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కోపోద్రిక్తులైన యువకుడి బంధువులు మహిళ ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు.
Man suicide: యువకుడి ఆత్మహత్య.. మహిళ ఇంటి ముందు బంధువుల ఆందోళన - యువకుడి ఆత్మహత్యతో రణసంద్రంగా మారికి బీకే లక్ష్మాపూర్
నాగర్ కర్నూల్ జిల్లా బీకే లక్ష్మాపూర్‌లో.. యువకుడి ఆత్మహత్యతో గ్రామం ఉద్రిక్తంగా మారింది. మృతుడి బంధువులు మృతదేహాన్ని గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటి ముందు పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకలా చేశారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.
మహిళ ఇంటి ముందు మృతదేహంతో బంధువుల గొడవ
అయినప్పటికీ వినకుండా మృతదేహాన్ని మహిళ ఇంటి ముందు సమాధి చేసేందుకు యత్నించారు. పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ఈరోజు ఉదయం మళ్లీ మృతదేహాన్ని మహిళ ఇంటి ముందు పూడ్చి పెట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గ్రామ పెద్దలు, పోలీసులు నచ్చజెప్పడంతో బలవంత్ బంధువులు శాంతించారు. అనంతరం బలవంత్ మృతదేహానికి వేరేచోట అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు