తెలంగాణ

telangana

ETV Bharat / crime

దారుణం: కుటుంబ కలహాలతో తమ్ముడిని చంపిన అన్నలు

కుటుంబ కలహాలతో సొంత అన్నలే తమ్ముడిని దారుణంగా హతమార్చిన ఘటన మంగళ్​హాట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మంగళ్​హాట్​ మర్డర్​
మంగళ్​హాట్​ మర్డర్​

By

Published : May 9, 2021, 7:19 PM IST

హైదరాబాద్​ మంగళ్​హాట్ పోలీస్​స్టేషన్ పరిధిలోని దూల్​పేట్​లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ప్రసాద్ అనే యువకుడు తన సొంత అన్నల చేతిలో హతమయ్యాడు.
మద్యానికి బానిసైన ప్రసాద్ తరచూ ఇంట్లో వారితో గొడవపడేవాడు. ఈరోజు తెల్లవారుజామున తల్లి ఇంట్లోలేని సమయంలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య చిన్నపాటి తగువు చోటుచేసుకుంది. అది కాస్తా పెద్దది కావడంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు అన్నలు తమ్ముడు ప్రసాద్ మెడకు చున్నీ బిగించి హతమార్చారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి.. కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details