తెలంగాణ

telangana

ETV Bharat / crime

లైవ్​ వీడియో: అందరు చూస్తుండగానే హత్య - hyderabad today crime news

అన్నదమ్ముల మధ్య ఆస్తి చిచ్చుపెట్టింది. ఆస్తి పంపకాలపై తరచూ గొడవలు జరిగి.. చివరికి అన్నను తుదముట్టించే వరకు వెళ్లింది. హైదరాబాద్ గోల్కొండ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన... ఆస్తులు రక్త సంబంధీకులను వేరు చేయడమే కాదు హత్యలు చేయిస్తాయనడానికి సజీవ ఉదాహరణగా నిలుస్తోంది.

younger brother brutally killed Anna in a property fight
లైవ్​ వీడియో: అందరు చూస్తుండగానే హత్య

By

Published : Mar 17, 2021, 4:33 AM IST

Updated : Mar 17, 2021, 8:36 AM IST

హైదరాబాద్ గోల్కొండ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో అన్నను దారుణంగా హతమార్చాడో ఓ తమ్ముడు. షేక్​పేటకు చెందిన విజయ్, నరేందర్ ఇద్దరు అన్నదమ్ములు. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. రాత్రి వీరిద్దరి మధ్య ఆస్తి మరింత వైరాన్ని పెంచింది. చివరకు నరేందర్ అన్న విజయ్​ను కర్రలతో దాడి చేసి చంపాడు.

విజయ్​ను హత్య చేసిన అనంతరం నిందితుడు నరేందర్ అక్కడి నుంచి పారిపోగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని వెంటనే పట్టుకుంటామని గోల్కొండ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది.

లైవ్​ వీడియో: అందరు చూస్తుండగానే హత్య

ఇదీ చదవండి:భర్తను చంపింది, జైలు పాలయ్యింది.. పిల్లలను ఒంటరి చేసింది..!

Last Updated : Mar 17, 2021, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details