నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముక్కలపల్లికి చెందిన కిష్టయ్య, భార్య, ఇద్దరు కూతుళ్లతో కలసి బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా పాటి గ్రామానికి వచ్చి కూలీ పని చేసుకుంటూ గుడిసెలో నివాసం ఉంటున్నాడు. కిష్టయ్య పెద్దకూతురు హైమావతి మేస్త్రీ వద్ద కూలీ పనిచేస్తూ ఉండేది.
తెల్లవారేసరికి అదృశ్యమైన యువతి.. తల్లిదండ్రుల పరేషాన్ - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయిన యువతి తెల్లవారేసరికి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా పాటి గ్రామంలో చోటుచేసుకుంది. యువతి తండ్రి భానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రి కుటుంబ సభ్యులతో నిద్ర.. ఉదయనికల్లా అదృశ్యం
ఈనెల 7న రాత్రి హైమవతి కుటుంబ సభ్యులతో ఇంట్లో కలిసి నిద్రపోతోంది. ఉదయం లేచి చూసేసరికి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి కిష్టయ్య భానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: SURVEY: పురుషుల్లో ఎక్కువగా బ్లాక్ ఫంగస్