పాస్టర్ షారోన్ అనే వ్యక్తి నమ్మించి మోసం చేశారంటూ... ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి సినీ నటి కరాటే కల్యాణి సహాయంతో రాజమహేంద్రవరం పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి పేరుతో నమ్మించి వీడియోలతో బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది.
మహిళకు పాస్టర్ వేధింపులు.. బాధితురాలికి అండగా కరాటే కల్యాణి - ap crime news
ఓ పాస్టర్ చేతిలో వేధింపులకు గురైన ఓ యువతికి సినీ నటి కరాటే కల్యాణి అండగా నిలిచారు. బాధిత యువతితో పాస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మహిళను దారుణంగా హింసించాడని ఆమె తెలిపారు.

మహిళకు పాస్టర్ వేధింపులు.. బాధితురాలికి అండగా కరాటే కల్యాణి
"రాజమహేంద్రవరం నగరానికి చెందిన పాస్టర్ వేధింపులతో మహిళ చాలా కుంగిపోయింది. అతడి బెదిరింపులతో హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడే ఆమె గురించి నాకు తెలిపింది. హైదరాబాద్‌లోని షీ టీమ్స్‌ను సంప్రదించాం. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరగడంతో.. వారి సూచన మేరకు ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేశాం. మహిళ నగ్న వీడియోలు తీసి దారుణంగా హింసించిన పాస్టర్‌ను కఠినంగా శిక్షించాలి"-కరాటే కల్యాణి, సినీ నటి
మహిళకు పాస్టర్ వేధింపులు.. బాధితురాలికి అండగా కరాటే కల్యాణి