ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయాన్ని అడ్డుగాపెట్టుకొని.. ఓ యువతి బెదిరింపులకు దిగింది. తాను కోరినంత డబ్బు ఇవ్వకుంటే.. అతడితో జరిపిన ఛాటింగ్‌లకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానంటూ హెచ్చరించింది. దీంతో యువకుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని భోళానగర్‌లో నివసించే ఓ యువకుడు(32)ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జులైలో అతడి ఫేస్‌బుక్ ఖాతాకు సాక్షి వర్మ పేరుతో ఓ మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. దానికి ఆమోదం తెలిపిన అనంతరం వారి మధ్య జరిగిన ఛాటింగ్‌తో క్రమంగా స్నేహం పెరిగింది. ఆ క్రమంలో సదరు యువతి తన దుస్తులను తొలగించి.. యువకుడిని అలాగే చేయాలంటూ సూచించింది. దీంతో ఆమె చెప్పినట్లు చేయగా.. అతడికి తెలియకుండానే వీడియో రికార్డింగ్ చేసింది.