యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇంట్లో చెప్పితే ఒప్పుకుంటారో లేదో అని భావించి.. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకొని పరారయ్యారు. ఇంతలోనే విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు.. యువకుడి ఇంటిని తగలబెట్టారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకుందామా?
ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడి ఇంటికి నిప్పు - హుజూరాబాద్‌లో ప్రేమికుడి ఇంటికి నిప్పు
16:14 January 03
పెళ్లి చేసుకుని పరారైన హుజురాబాద్‌కు చెందిన ప్రేమజంట
ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న అక్కసుతో ఓ ప్రేమ జంటపై అమ్మాయి తరపు బంధువులు కక్షగట్టారు. అబ్బాయి ఇంటిని దహనం చేసి దారుణానికి ఒడిగట్టారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన వరికిళ్ల రాజశేఖర్, పిట్ట సంజనలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ-పెళ్లిని అంగీకరించని అమ్మాయి కుటుబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు.
వారిపై కోపంతో అబ్బాయి నివసించే ఇంటికి నిప్పు పెట్టారు. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో ఆ ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. సీఐ రమేష్, ఎస్సై రాజన్నలు సంఘటన స్థలాన్ని పరిశీలించి, రూ.2.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అమ్మాయి తరపు బంధువులు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాజశేఖర్ తండ్రి దేవయ్య ఆరోపించారు. వారి నుంచి తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.
"అమ్మాయిని తీసుకొని వెళ్లి మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. మా అబ్బాయిని మీ ఇళ్లు తగులబెడతాం.. మీ వాళ్లను చంపుతామని యువతి కుటుంబీకులు బెదిరించారు. ఇంటికి తలుపు సరిగ్గా లేకపోవడంతో యువతి కుటుంబీకులు వచ్చి ఇంటిని తగులబెట్టారు. ఇంటిలో ఉన్న అన్ని వస్తువులు అగ్నికి బుగ్గి అయిపోయావి. డబ్బులు కాలిపోయావి. ఇప్పుడు మాకు నిరాధారం లేకుండా పోయింది." - దేవయ్య, పెళ్లికొడుకు తండ్రి
ఇవీ చదవండి: