పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ కోట సుమంత్... అదే గ్రామానికి చెందిన ఓ యువతిని మూడేళ్లుగా ప్రేమించాడు. ఆ యువతి పెళ్లి చేసుకుందామనగానే ముఖం చాటేశాడు. ఆ యువతి ఆదివారం రాత్రి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి... నిరసన వ్యక్తం చేసింది. పోలీసులు వచ్చి.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో... బాధితురాలు ఆందోళన విరమించింది. బాధితురాలికి మహిళా సంఘాలు, సఖి కేంద్రం నిర్వాహకులు అండగా నిలిచారు.
మూడేళ్ల ప్రేమ... పెళ్లనగానే ముఖం చాటేసిన ప్రజా ప్రతినిధి - kadambapur village latest news
ఆయనో ప్రజా ప్రతినిధి.. ఓ అమ్మాయిని ప్రేమించాడు.. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామనగానే.. ముఖం చాటేశాడు. దీనితో ఆ అమ్మాయి... చేసేదేమి లేక ఆదివారం రాత్రి ప్రజాప్రతినిధి ఇంటిమందు బైఠాయించి.. నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కదంబపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రేమించాడు.. పెళ్లి అనగానే పరార్