తెలంగాణ

telangana

ETV Bharat / crime

లైంగిక దాడిని ప్రతిఘటించిన యువతికి నిప్పు.. చికిత్స పొందుతూ మృతి - women resisted sexual assault

young woman died while receiving treatment who resisted sexual assault caught fire
young woman died while receiving treatment who resisted sexual assault caught fire

By

Published : Feb 19, 2022, 3:19 PM IST

Updated : Feb 19, 2022, 4:07 PM IST

15:14 February 19

లైంగిక దాడిని ప్రతిఘటించిన యువతికి నిప్పు.. చికిత్స పొందుతూ మృతి

ప్రేమించానన్నాడు. ఎన్నో మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటా నాతో వచ్చేయమన్నాడు. నమ్మి ఇంటి నుంచి వచ్చేశాక.. ఆ మాటే దాటేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తే.. వదిలించుకోవాలనుకున్నాడు. వదిలించుకునే ముందు తీసుకొచ్చిన పని ముగించుకోవాలనుకున్నాడు. ఓ రాత్రి పూట తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాడిని ప్రతిఘటించిందని.. దివ్యాంగురాలని కూడా చూడకుండా యువతికి నిప్పంటించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగింది.

హైదరాబాద్​ నుంచి మద్దూరుకు..

మద్దూర్ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్​లోని ఉప్పరపల్లిలో పని చేసుకుంటూ జీవిస్తోంది. కోయిల్​కొండ మండలం వింజమూర్​కు చెందిన వెంకట్రాములు కూడా ఉప్పరపల్లిలోనే పనిచేస్తున్నాడు. కొంతకాలంగా యువతితో పరిచయం పెంచుకున్న వెంకట్రాములు.. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారం రోజుల క్రితం.. యువతిని హైదరాబాద్ నుంచి మద్దూర్​కు తీసుకొచ్చాడు. రోజులు గడుస్తున్నా.. పెళ్లి చేసుకోకపోవటంతో వెంకట్రాములుపై యువతి ఒత్తిడి తీసుకొచ్చింది.

చావుతో పోరాడి చివరికి..

అమ్మాయి పోరు భరించలేక.. వాడుకుని వదిలేద్దామని వెంకట్రాములు కుట్ర పన్నాడు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలకు నిన్న(ఫిబ్రవరి 19న) రాత్రి సమయంలో యువతిని తీసుకొచ్చి బలాత్కారం చేయబోయాడు. ఇష్టం లేని యువతి.. దాడిని ప్రతిఘటించింది. కోపంతో వెంకట్రాములు.. యువతిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. 90 శాతం కాలిన గాయాలతో అరుస్తున్న యువతిని స్థానికులు గుర్తించారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్​నగర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి నేడు ఉదయం మృతి చెందింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Feb 19, 2022, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details