తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రేమపెళ్లికి పెద్దల నిరాకరణ... యువతి ఆత్మహత్య.. ప్రియుడేమో! - నెల్లూరు జిల్లాతాజా వార్తలు

వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకొనేందుకు యువతి బంధువులతో మాట్లాడాడు ఆ యువకుడు. వారి నుంచి నిరాకరణ ఎదురైంది. ఆ తరువాత ఏమైందో తెలియదు గానీ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు.. మాత్రలు మింగి, బ్లేడుతో గొంతు, శరీరంపై కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

ap crime news
ప్రేమపెళ్లికి పెద్దల నిరాకరణ... యువతి ఆత్మహత్య.. ప్రియుడేమో!

By

Published : Feb 22, 2021, 10:29 PM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పుల్లాయపల్లె గ్రామానికి చెందిన నజ్మా అనే యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్న యువకుడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

గ్రామానికి చెందిన నజ్మా, ఇమామ్ ఖాసీం ఒకరినొకరు ఇష్టపడ్డారు. నజ్మాను పెళ్లి చేసుకుంటానని ఇమామ్ ఖాసీం... నజ్మా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. అందుకు వారు అంగీకరించలేదు. ఆ తరువాత ఏం జరిగిందో.. ఆదివారం రాత్రి పశువులకు మేత వేస్తానని చెప్పి.. నజ్మా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఉదయాన్నే వెతికారు. గ్రామానికి సమీపంలోని బావి వద్ద పాదరక్షలు, చున్నీ ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. సాయంత్రానికి నజ్మా మృతదేహాన్ని బయటకు తీశారు.

నజ్మా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిసిన ఇమామ్ ఖాసీం.. కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి మాత్రలు మింగాడు. అలాగే బ్లేడుతో గొంతు, కాళ్లు, చేతులపై కోసుకొని గ్రామస్థులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని బద్వేల్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నజ్మా బంధువులు ఫిర్యాదులో కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి:హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్‌ కారును ఢీకొట్టిన లారీ

ABOUT THE AUTHOR

...view details