నారాయణపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మక్తల్ శివారులోని వడ్వాట్ గ్రామానికి వెళ్లే పాత రోడ్డు మార్గంలో ఓ మహిళని దుండగులు కాల్చిచంపారు. మద్యం మత్తులో మహిళని కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మక్తల్ శివారులో మహిళ దారుణ హత్య - makthal latest news
మక్తల్ శివారులో మహిళ దారుణ హత్య జరిగింది. దుండగులు మహిళను చంపి.. తగులబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మక్తల్ శివారులో యువతి దారుణ హత్య
మొదట యువతిగా గుర్తించిన తర్వాత మృతదేహం పక్కనే పగిలిన గాజులు ఉన్నాయి. ఆ మహిళ వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మహిళను రాయితో గానీ, ఇనుప రాడ్తో గానీ తలపై బలంగా కొట్టినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చంపిన అనంతరం మహిళను ముళ్లపొదల్లో వేసి తగల పెట్టారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.
- ఇదీ చదవండి :కరోనా యోధులకు కరవైన ప్రభుత్వ సాయం
Last Updated : Mar 29, 2021, 1:47 PM IST