కాలనీ వాసులంతా గణేశుని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. అంతలోనే విషాదం. వినాయకుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ.. ఓ యువకుడు అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన.. ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తిలోని గౌతమిపూరి కాలనీలో జరిగింది.
live video: గణేశ్ మండపం వద్ద డాన్స్ చేస్తూ.. అంతలోనే... - ap news
అంతా క్షణాల్లో జరిగిపోయింది. వినాయకుడి మండపంలో అప్పటిదాకా ఆహ్లదంగా గడిపిన యువకుడిని మృత్యువు కబలించింది. సరదాగా డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏమైంది లేవరా అంటూ తన తోటి స్నేహితులు ఆ యువకుడిని పైకి లేపేలోపే ప్రాణంపోయింది. ఈ విషాదం అనంతపురం జిల్లాలో జరిగింది.
young
కాలనీలోని గణేశుని మండపం వద్ద నిర్వహించిన ఉత్సవాల్లో డాన్స్ చేస్తూ.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. యువకుడి స్నేహితులు, స్థానికులు.. చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటివరకు తమతో సరదాగా గడిపిన యువకుడి ఆకస్మిక మరణంతో...కాలనీలో విషాదం నెలకొంది.
ఇదీ చూడండి:AP CRIME NEWS: బట్టలు దోచుకెళ్లిన పోలీసులు.. పట్టించిన సీసీటీవీ దృశ్యాలు