వరంగల్ అర్బన్ జిల్లా హాసన్పర్తి మండలం ఎల్లపూర్ బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) ఓ యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వచ్చి బస్‌ను బలంగా ఢీ కొట్టాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Road accident: వేగంగా వచ్చి.. బస్సుని ఢీకొని యువకుడు మృతి - warangal urban district latesst crime news
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Road accident: వేగంగా వచ్చి.. బస్సుని ఢీకొని యువకుడు మృతి
తొర్రూరుకు చెందిన అనిల్ పని నిమిత్తం హన్మకొండకు వస్తుండగా.. ఎల్లపూర్ బస్టాండ్ వద్ద వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టాడు. హెల్మెట్ ఉంటే బతికే వాడని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'