మహబూబ్‌నగర్ జిల్లాలో ద్విచక్రవాహనంపై పెళ్లికి వెళ్తుండగా.. కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మోనప్పగుట్ట, కిద్వాయ్ పేట ప్రాంతాలకు చెందిన మహేష్(23), శరత్ కుమార్ (22) ఖిల్లా గణపురం మండలం మానాజిపేటలో జరిగే వివాహ వేడుకకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. భూత్పూర్ మండలం తాటికొండ గ్రామం మీదుగా 44వ జాతీయ రహదారి వద్ద రోడ్డు దాటుతుండగా.. ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
accident: పెళ్లికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం - తెలంగాణ వార్తలు
మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై పెళ్లికి వెళ్తుండగా కారు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, మహబూబ్‌నగర్ రోడ్డు ప్రమాదం
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. రైతు మృతి