Fight with knives: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని రెండో వార్డులో శనివారం రాత్రి కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సజాత్ అనే వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభానికి కొండి వేసి పనులు చేయిస్తున్నాడు. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న సల్మాన్ అనే యువకుడు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సల్మాన్ తన ఇద్దరు సోదరులతోపాటు బాన్సువాడకు చెందిన ఇద్దరు మిత్రులను రప్పించి సజాత్‌పై కత్తులతో దాడికి పాల్పడ్డాడు.
Fight with knives: బీర్కూర్‌లో కత్తిపోట్ల కలకలం... ఒకరి పరిస్థితి విషమం - కామారెడ్డి జిల్లా క్రైమ్ న్యూస్
Fight with knives: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో కత్తిపోట్ల కలకలం రేగింది. మూడో వార్డులోని కొందరు వ్యక్తులు ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకోవడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ దాడిలో సజాత్ బంధువులైన సమీ, పయాజ్, హలీం, మోహిన్‌లు గాయపడ్డారు. హస్లాం అనే వ్యక్తి చాతిపై బలమైన కత్తిపోట్లు పడి తీవ్రగాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మరోనలుగురు బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలనీలో కత్తిపోట్లు కలకలం రేపడంతో పరిస్థితి ఉద్రితంగా మారడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘలనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి:Suicide: భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య