విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. దామచర్ల పరిధిలోని వీర్లపాలెంకు చెందిన గుమ్మం నరేష్(24) యాదాద్రి పవర్ ప్లాంట్‌లో డైలీ లేబర్ ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నాడు. అతను సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరా మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి వివాహం జరిగి నాలుగు నెలలు అవుతుందని.. తండ్రి చనిపోగా ఇంటికి పెద్దదిక్కుగా పవర్ ప్లాంట్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని స్థానికులు తెలిపారు.
పవర్ ప్లాంట్‌లో ప్రమాదం: ఒకరు మృతి - electrical accident at the Yadadri power plant in Nalgonda district
నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ప్రమాదం: ఒకరు మృతి
ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో.. తల్లి, భార్యతోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:చెన్నై మెరీనా బీచ్‌లో ముగ్గురు ఏపీ విద్యార్థులు గల్లంతు