హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి మహబూబ్ అలియాస్ అబ్బాస్ (24) అనే యువకునిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి(Young Man Murder in Hyderabad) చేశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుణ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మూణ్నెళ్ల క్రితం ఫలక్‌నుమా పీఎస్ పరిధికి చెందిన ఓ యువతితో అబ్బాస్ వివాహం జరిగింది. అతడు స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో భోజనం చేసిన అబ్బాస్ ఏదో పని మీద బయటకు వెళ్లాడు. ఇంటి నుంచే అతణ్ని ఫాలో అయిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముస్తఫానగర్‌లోని ఓ కిరాణా దుకాణం వద్ద అతడిపై కత్తులతో దాడి(Young Man Murder in Hyderabad) చేశాడు.