హైదరాబాద్ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ బస్తీలో రామ్ అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. రామ్ మద్యం మత్తులో పడిపోయి తలకు గాయం కావడంతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ఇందిరానగర్ బస్తీలో యువకుడి అనుమానాస్పద మృతి - man died suspiciously in Hyderabad
హైదరాబాద్ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ బస్తీలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు, బంధువులు.. అది హత్యేనని ఆరోపించారు.
యువకుడి అనుమానాస్పద మృతి, హైదరాబాద్‌లో యువకుడి అనుమానాస్పద మృతి
మరోవైపు అతని కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం.. రామ్‌ది కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అతనిది హత్యా లేక కింద పడి మరణించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.