young man suicide: సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో యువకుడి ఆత్మహత్య అనుమానాస్పదంగా మారింది. వివాహిత తనతో మాట్లాడటం లేదని దుర్గేశ్ అనే యువకుడు ఆ మహిళ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుర్గేశ్ బోయిన్‌పల్లికి చెందిన ప్రేమ్ స్వరూప్ అనే వ్యక్తి వద్ద ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమ్ స్వరూప్ భార్యతో దుర్గేష్ గత కొన్నాళ్లుగా మాట్లాడుతున్నాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్ల పాటు స్నేహం కొనసాగింది. ఆ మహిళ కొన్ని రోజుల నుంచి మాట్లాడకపోవడంతో మనస్తాపం చెంది ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతిపై అనుమానాలు..
దుర్గేశ్ ఆత్మహత్య పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రేమ్ స్వరూప్ ఇంటికి పనిమీద వెళ్లిన దుర్గేశ్ అక్కడే ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ప్రేమ్ స్వరూప్ భార్యకు దుర్గేశ్‌కు మధ్య గొడవ జరిగినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.