Young Man Suicide in NTR District: మరికొన్ని గంటల్లో ఉన్నత చదువుల కోసం విమానం ఎక్కి లండన్ వెళ్లాల్సిన కుమారుడు అంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చాడు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం హనుమంతుపాలెం గ్రామానికి చెందిన గాడిపర్తి వెంకటనారాయణ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ లండన్లో ఎంఎస్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు శివకృష్ణ(24) కూడా ఉన్నత చదువుల కోసం బుధవారం వేకువజామున 2.15 గంటలకు శంషాబాద్లో విమానం ఎక్కి లండన్ వెళ్లాలి.
అందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. తల్లిదండ్రులు కుమారుడిని ఎయిర్పోర్టుకు పంపించడానికి సిద్ధమయ్యారు. ఇక హైదరాబాద్కు కారులో బయలుదేరడమే ఉంది. ఈ పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు స్నేహితులను కలిసి వస్తానని చెప్పి శివకృష్ణ ఇంటి నుంచి వెళ్లి రాలేదు. సమయం అవుతోందని, ఇంటికి రావాలని ఆరు గంటల సమయంలో తండ్రి కుమారుడితో సెల్ఫోన్లో మాట్లాడారు. ఇంకా సమయం ఉందని, వస్తున్నానని చెప్పాడు.