Young Man Suicide in Nandyala District: ‘మా అమ్మాయిని మర్చిపో.. లేదంటే చంపేస్తాం’ అని ఓ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బెదిరించడంతో ఎస్సీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేములలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. చాకరాజువేములలోని ఎస్సీ వర్గానికి చెందిన ప్రసన్న కుమార్ (24) వైయస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు.
Crime News: ‘మా అమ్మాయిని మర్చిపో.. లేదంటే చంపేస్తాం' - andhra pradesh news
Young Man Suicide in Nandyala District: వేగంతో పరిగెడుతున్న కాలంలో మనుషులు మారడం లేదు. కొన్ని ప్రాంతాలలో ఆనాటి పద్దతులు పాటిస్తూ నేటి సమాజానికి మాయనిమచ్చలా తయారవుతున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన యువకుడు, మరో వర్గానికి చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు బెదిరించడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీ నంద్యాలలో చోటుచేసుకుంది.
Suicide
ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి ప్రసన్నకుమార్‌ను బెదిరించారు. యువతిని మరచిపోలేక అతను సోమవారం ఇంట్లో విష గుళికలు మింగాడు. స్థానికులు నంద్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగా మంగళవారం మృతి చెందాడు. ప్రసన్నకుమార్ తల్లి ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇవీ చదవండి
Last Updated : Jan 11, 2023, 10:56 AM IST