యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పెద్ద తండాలో దారుణం జరిగింది. చెల్లెలి వరుసైన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడని(rape attempt on girl) చిన్నారి కుటుంబసభ్యులు తెలిపారు. ధీరావత్ నవీన్ అనే యువకుడు తన ఇంటి పక్కనే ఉండే రెండేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించినట్లు వాపోయారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని చెప్పారు.
Rape attempt on girl: అమానుషం... రెండేళ్ల చెల్లెలిపై అత్యాచారయత్నం - తెలంగాణ వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద తండాలో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు(rape attempt on girl) ఓ కామాంధుడు. చెల్లెలి వరుసైన చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించినట్లు బాలిక కుటుంబసభ్యులు తెలిపారు.
rape attempt on girl
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని... ఆరా తీస్తున్నారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని... దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు నవీన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో ఇద్దరు యాచకుల దారుణ హత్య