తెలంగాణ

telangana

ETV Bharat / crime

'స్నేహితులే చంపేశారు.. మూడేళ్లైనా న్యాయం జరగలేదు..!' - తెలంగాణ వార్తలు

తమ కుమారుడి అనుమానాస్పద మృతి ఘటనలో పోలీసులు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఘటన జరిగి మూడేళ్లు అవుతున్నా.. న్యాయం జరగలేదని వాపోయారు. నిందితులను పట్టుకొని.. తమకు న్యాయం చేయాలంటూ వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

young-man-parents-allegations-on-friends-of-his-death-issue-at-hanamkonda-in-warangal-rural-district
'విషమిచ్చి స్నేహితులే చంపేశారు.. మూడేళ్లైనా న్యాయం జరగలేదు!'

By

Published : Mar 15, 2021, 3:47 PM IST

మూడేళ్లు అవుతున్నా.. తమ కుమారుడి మృతికి కారణమైన వ్యక్తులను అరెస్ట్ చేయలేదని హన్మకొండలో భార్యభర్త ఆందోళనకు దిగారు. స్నేహితుని పెళ్లికి తీసుకెళ్లి అతని మిత్రులే తమ కుమారుడు ఆశాడపు రాజేశ్‌ను విషమిచ్చి చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగి మూడేళ్లు అవుతున్నా నిందితులపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. పేదవాడికి న్యాయం జరగడానికి ఇంకా ఎంత సమయం పడుతుందా అని ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరిసిస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.

న్యాయం చేయాలి...

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి చెందిన ఆశాడపు రాజేశ్‌ను.. స్నేహితుడి పెళ్లి కోసమని మిత్రులు నవీన్, వినోద్ తీసుకెళ్లారని మృతుడి తల్లిదండ్రులు లక్ష్మి, దశరథం తెలిపారు. ఆరోజు రోడ్డు మీద ఒక్కసారిగా కుప్పకూలి తమ కుమారుడు చనిపోయాడని వెల్లడించారు. తమ కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇంట్లో ఉన్న వాడిని తీసుకెళ్లి... స్నేహితులే మద్యంలో విషం కలిపి చంపారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. రాజేశ్ మృతికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:140 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత

ABOUT THE AUTHOR

...view details