Ameerpet Metro News : హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాద్‌కు చెందిన ఓ యువతి(23) మంగళవారం రోజున అమీర్‌పేటలో షాపింగ్ ముగించుకుని తిరిగి ఖైరతాబాద్ వెళ్లేందుకు అమీర్‌పేట మెట్రో స్టేషన్ లిఫ్ట్ ఎక్కింది. అమె వెనకే లిఫ్ట్‌లోకి ప్రవేశించిన రాజు(19) అనే యువకుడు తన దుస్తులు విప్పి, అసభ్య చేష్టలతో హడలెత్తించాడు.
అమీర్‌పేట మెట్రో లిఫ్ట్‌లో.. దుస్తులు విప్పి.. - అమీర్‌పేట మెట్రో లేటెస్ట్ న్యూస్
Ameerpet Metro News : హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ఉండే ఓ యువతి అమీర్‌పేటలో షాపింగ్‌కు వెళ్లింది. షాపింగ్ పూర్తయ్యాక మంగళవారం సాయంత్రం తిరిగి ఇంటికి బయలుదేరదామని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌కు వెళ్లింది. చేతిలో షాపింగ్ బ్యాగ్స్ ఉండటం వల్ల ఎస్క్‌లేటర్ ఉపయోగించకుండా ఖాళీగానే ఉంది కదా అని లిఫ్ట్ ఎక్కింది. హమ్మయ్య లిఫ్ట్‌లో ఎవరూలేరు అని అనుకునేలోగానే.. ఓ యువకుడు ఎక్కాడు. తననే తదేకంగా చూస్తుండటంతో ఆ యువతి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది. ఇతడి వాలకమేంటో తేడాగా ఉందని అనుకునేలోగా.. ఆ యువకుడు తన దుస్తులు విప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే లిఫ్ట్‌లో నుంచి పరుగులు తీసి మెట్రో సిబ్బందికి ఫిర్యాదు చేసింది.
Ameerpet Metro News
వెంటనే ఆమె లిఫ్ట్‌లో నుంచి పరుగున బయటకొచ్చి మెట్రో సిబ్బందికి చెప్పింది. వారు రాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజు రోజు మెట్రో స్టేషన్ లిఫ్ట్ వద్దే ఉంటూ ఒంటరిగా వెళ్లే మహిళల ముందు ఇదే తీరుగా అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజును అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.
- ఇదీ చదవండి :ప్రాణం తీసిన 'ఉప్పు'.. గోడ కూలి 12 మంది దుర్మరణం