murder in old city Hyderabad today: హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. అర్ధరాత్రి ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు.. యువకుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి చంపారు. విషయం తెలుసుకున్న దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య, అడిషనల్ డీసీపీ ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గురైన యువకుడు అబూబకర్ అమూదిగా పోలీసులు గుర్తించారు.
పాతబస్తీలో యువకుడి దారుణ హత్య, ఆ గొడవలే కారణమా - యువకుడు దారుణ హత్య
murder in old city Hyderabad today హైదరాబాద్లోని పాతబస్తీలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు కత్తులతో పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Murder in Patabasti
ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. యువకుడి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: