young man murder at Dharur : జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లో దారుణం జరిగింది. కత్తులతో నరికి ఓ యువకుడిని కిరాతకంగా హతమార్చారు. ఇరిశెట్టి రాజేశ్ అనే యువకుడు పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తుండగా.. మాటువేసిన ప్రత్యర్థులు కత్తులతో నరికి చంపారు. రక్తం మడుగులో అక్కడికక్కడే రాజేశ్ మృతి చెందాడు. ఈ హత్యకులకు భూ తగాదాలే కారణమని తెలుస్తోంది.
young man murder in Jagtial : పాతకక్షలతో.. మాటువేసి మట్టుబెట్టారు! - young man murdered at jagtial
young man murdered: జగిత్యాల జిల్లా ధరూర్‌లో దారుణ హత్య జరిగింది. పాతకక్షలతో కొంతమంది.. ఓ యువకుడిని మాటువేసి మరీ హత్యచేశారు. గత కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
Young Man Killed in Jagtial : ఏడాదిన్నర క్రితం ఇదే భూవివాదంలో గంగారెడ్డి అనే యువకుడి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో రాజేశ్ నిందితుడిగా ఉన్నారు. అయితే రాజేష్‌పై కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు.. మాటువేసి హత్యచేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇదీచూడండి:చెరువులో యువతి మృతదేహం.. హత్యాచారమేనా..?