తెలంగాణ

telangana

ETV Bharat / crime

లైవ్ వీడియో : మైలార్​దేవ్​పల్లిలో యువకుడి కిడ్నాప్.. - young man kidnap in rangareddy district

రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కింగ్స్ కాలనీలో ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆ యువకుడికి నిశ్చితార్థం జరిగిన అమ్మాయి ప్రియుడే కిడ్నాప్​ చేసుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

kidnap, young man kidnap, rangareddy district news
కిడ్నాప్, యువకుడి కిడ్నాప్, రంగారెడ్డి జిల్లా వార్తలు

By

Published : Apr 17, 2021, 10:30 AM IST

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్‌ కలకలం రేగింది. స్థానిక కింగ్స్ కాలనీలో ఉండే నదీమ్ ఖాన్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇటీవల నదీమ్‌ఖాన్‌కు ఓ అమ్మాయితో నిశ్చితార్థం కాగా... ఆ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తే నదీమ్‌ను అపహరించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళ నదీమ్‌ ఖాన్‌ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆపి.. ఇద్దరు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి కిడ్నాప్ సీసీటీవీ దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details