ఇటుకలోడ్తో వెళుతోన్న ఓ ట్రాక్టర్ మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పక్కన ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇర్ఫాన్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్... ఒకరికి గాయాలు - కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం
ఇటుకల లోడ్‌తో రాంగ్ రూట్లో ప్రయాణిస్తోన్న ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళుతోన్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లాలో జరిగింది.
ట్రాక్టర్ ఢీ కొని యువకుడికి గాయాలు
ట్రాక్టర్ బోల్తా పడడంతో వాహనంలోని ఇటుకలు రోడ్డుకు ఇరువైపులా పడపోయాయి. ఈ కారణంగా ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది.