నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూర్లో యువకుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మంగళవారం మృతి చెందాడు. వేసవి కావడంతో తోటి స్నేహితులతో కలిసి వెంకటేష్(18)ఈతకు వెళ్లాడు. కానీ ఈత రాకపోవడంతో అతను బావి గడ్డపై కూర్చున్నాడు.
బావిలో పడి యువకుడు మృతి - telangana crime news
తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.
బావిలో పడి యువకుడు మృతి
ప్రమాదవశాత్తు గడ్డపై ఉన్న ఆ యువకుడు బావిలో పడ్డాడు. నీళ్లు ఎక్కువగా ఉండడంతో అడుగుకు చేరుకున్నాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతుడిని వెలికి తీశారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై మురళి గౌడ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి :రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు దుర్మరణం