వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి రాజేష్ అనే యువకుడు.. నీటి ప్రవాహంలో జారి పడి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రాజేష్... హైదరాబాద్లోని సురారంలో నివాసముంటున్నాడు.
ఆదివారం కావటంతో.. బంధువులతో కలిసి లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్దకు విహార యాత్రకు వెళ్లాడు. అక్కడ దృశ్యాలను చరవాణీలో బంధించి... సెల్ఫీలు తీసుకుంటున్నారు. నలుగురు కలిసి ప్రాజెక్టు అలుగు వద్ద.. సెల్ఫీ దిగేందుకు వెళ్లి.. నీటి ప్రవాహంలో జారి పడ్డారు. అక్కడే ఉన్న జాలర్లు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. నీటిలోకి దిగి ముగ్గురిని ప్రమాదం నుంచి రక్షించారు. రాజేష్ మాత్రం నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.