భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది స్నానఘట్టాల వద్ద స్నానానికి దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. జిల్లాలోని ఇల్లందు, మణుగూరుకు చెందిన కొన్ని కుటుంబాలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో భద్రాచలం వచ్చారు. గోదావరిలో స్నానం చేసి దైవాన్ని దర్శించుకుందాం అనుకున్నారు. స్నానం చేస్తున్న క్రమంలో లోతుకు వెళ్ళిన ముగ్గురు యువకులు గోదావరిలో మునిగి పోయారు. ఇద్దరు యువకుల్ని పక్కనే ఉన్న వారు కాపాడారు. మణుగూరుకు చెందిన మోతుకూరు సురేశ్ మాత్రం గోదావరిలో గల్లంతయ్యాడు.
స్నానానికి గోదావరిలో దిగిన యువకుడు గల్లంతు - young man fall in godavari river
స్నానానికి గోదావరిలో దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి కోసం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు పడవ సహాయంతో గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గోదావరిలో యువకుడు గల్లంతు
సురేశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తన తాత సంవత్సరికం కోసం మణుగూరుకి వచ్చాడు. గల్లంతైన యువకుడి కోసం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు పడవ సహాయంతో గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:'నేను చనిపోతున్నా'.. అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్య