తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. కుటుంబీకుల ఆందోళన - rangareddy district crime news

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లోని మామిడితోటలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో తోట యజమానే తమ కుమారుడిని హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆందోళనకు దిగారు.

Young man dies in suspicious circumstances
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

By

Published : Mar 31, 2021, 1:24 PM IST

రంగారెడ్డి జిల్లా కర్మన్​ఘాట్ దుర్గానగర్​లో విషాదం చోటుచేసుకుంది. ఆనంద్​ అనే యువకుడు మొయినాబాద్​లోని ఓ మామిడితోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆనంద్​ దుర్గానగర్ కాలనీకి చెందిన డాక్కుమెంటరీ రైటర్ రాములు ఇంట్లో అద్దెకుండేవాడు. అతడికి చెందిన మామిడి తోటలోనే చనిపోయాడు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో ఆనంద్​ను హత్య చేశారంటూ కుటుంబీకులు రాములు ఇంటిముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి.. పడుకునేందుకు డాబా మీదకు వెళ్లారు.. తిరిగి వచ్చేసరికి ఇళ్లు గుళ్ల చేశారు

ABOUT THE AUTHOR

...view details