దుర్గమాత శోభాయాత్రలో నృత్యం చేస్తూ యువకుడు కుప్పకూలి మృతి చెందిన (Young man died) ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని దోబీ గల్లీ కాలనీలో చోటుచేసుకుంది. దోబీ గల్లీ కాలనీలో దుర్గమాతను ప్రతిష్ఠించారు. శనివారం సాయంత్రం నిమజ్జనం చేయడానికి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో శోభాయాత్రను ప్రారంభించారు.
Young man died: దుర్గమాత శోభాయాత్రలో నృత్యం చేస్తూ యువకుడు మృతి - Nirmal crime news
దుర్గమాత శోభాయాత్రలో నృత్యం చేస్తూ యువకుడు మృతిచెందిన (Young man died) ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

దుర్గమాత శోభాయాత్ర
శోభాయాత్రలో అందరితో కలిసి సాయినాథ్ అనే యువకుడు నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి (Young man died) చెందాడు. కొద్దిసేపటి వరకు తమతో నృత్యం చేస్తూ ఒక్కసారిగా మృతి చెందడం వల్ల స్నేహితులు, కాలనీ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు నెలల క్రితమే యువకుడి తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
ఇదీ చూడండి: etela rajender: 'ఉపఎన్నికల్లో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మరి మీరు?'