ఓ యువకుడిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేయగా... తీవ్ర గాయలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామానికి చెందిన బొమ్మకంటి అజిత్ గౌడ్(19) పై... అదే గ్రామానికి చెందిన తాళ్ల రాములు ఆదివారం రాత్రి సమయంలో కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అజిత్‌ను మొదట సూర్యాపేట ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
యువకునిపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కత్తితో దాడి చేయగా... తీవ్ర గాయలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి మధ్య పాత కక్ష్యలే కారణమని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
![యువకునిపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి young man died while receiving treatment in Suryapet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10726701-887-10726701-1613978322023.jpg)
యువకునిపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి
పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అజిత్ గౌడ్ మరణించినట్లు తెలిపారు. పాత కక్ష్యల కారణంగానే ఇద్దరి మధ్య మాటా మాటా పెరగి ఘర్షణకు దారితీసినట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామానికి చేరుకుని భద్రతను ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: బయో ఆసియా సదస్సులో భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలకు ఎక్స్‌లెన్స్ అవార్డ్