తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రాణం తీసిన ఆర్​ఏంపీ​ వైద్యం.. ఇంజక్షన్​ వికటించి యువకుడు మృతి

గ్రామంలో తెలిసి తెలియని వైద్యంతో విదేశాల్లో విద్యను అభ్యసించాల్సిన ఆ యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. మరో వారం రోజుల్లో ఆస్ట్రేలియా పయనమవ్వాల్సిన ఆ విద్యార్థి ఆర్​ఎంపీ డాక్టర్​ చేసిన పనికి​ కానరానిలోకాలకు పయనమ్యాడు. జ్వరంతో బాధపడుతున్న ఆ యువకుడుకి ఆర్​ఏంపీ చేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాధపురంలో జరిగింది.

student dies after botched injection
student dies after botched injection

By

Published : Nov 16, 2022, 1:29 PM IST

ఇంజక్షన్ వికటించి యువకుడి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాధపురంలో జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం జగన్నాధపురం గ్రామానికి చెందిన రవీందర్ గౌడ్ గీత కార్మికుడుగా వృత్తి కొనసాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కమారుడు బండి విజయ్ ఎంబీఏ చదవడానికి మరో వారం రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా ఇంతలో ఆయనకు జ్వరం వచ్చింది.

దీంతో ఆయనకు ఊర్లో ఉన్న ఆర్​ఏంపీ డాక్టర్​తో చికిత్స అందించారు. నాలుగు రోజులు క్రితం ఆర్ఏంపీ డాక్టర్​ ఇచ్చిన ఇంజక్షన్​ వికటించడంతో తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు. దీంతో బండి విజయ్​ను వరంగల్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడ కుడా పరిస్థితి విషమించడంతో ఏంజీఏం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే యువకుడు మరణించాడు. విజయ్ అకాల మృతితో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

చేతికి అంది వచ్చిన కుమారుడు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు విజయ్ మృతికి కారకుడుగా భావిస్తోన్న ఆర్ఎంపీ డాక్టర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆర్​ఎంపీ డాక్టర్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details