ప్రమాదవశాత్తు ప్రభాకర్(23) అనే యువకుడు చెరువులో పడి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం గ్రామంలో గురువారం జరిగింది. మృతుని పిన్ని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడి మృతి - అశ్వారావుపేటలో చెరువులో పడి యువకుడి మృతి
కూలీ పనుల కోసం పిన్ని ఇంటికొచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన ప్రభాకర్ మూడు నెలల నుంచి పాండురంగాపురంలోని తన పిన్ని ఇంట్లో నివాసం ఉంటూ స్థానికంగా కూలి పనులకు వెళ్తున్నాడు. గురువారం చేపలవేట కోసం గ్రామంలోని పోలిశెట్టి చెరువుకు వెళ్లిన ప్రభాకర్ ప్రమాద వశాత్తు కాలుజారి నీటిలో పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:యువకుల కర్కశం... గిరిజన మహిళపై అత్యాచారం