మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం సుభాశ్ నగర్ బస్తీకి చెందిన బడుగుల లింగయ్య, రాజవ్వలతోపాటు కుమారుడు మధు ఇంటి బయట నిద్రిస్తుండగా... శనివారం అర్ధరాత్రి కారు ఇంట్లోకి దూసుకొచ్చింది. మధుపై నుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇంటి బయట నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి - తెలంగాణ వార్తలు
బెల్లంపల్లి పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
బెల్లంపల్లిలో కారు బీభత్సం, కారు ప్రమాదంలో ఒకరు మృతి
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే మృతిచెందడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తీవ్రగాయాల పాలైన వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మద్యం సేవించి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.