తెలంగాణ

telangana

ETV Bharat / crime

నైట్రోజన్ గ్యాస్ పీల్చుకుని యువకుడు ఆత్మహత్య - తెలంగాణ వార్తలు

నైట్రోజన్ గ్యాస్ పీల్చుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మానసిక ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

young man committed to suicide with nitrogen gas
నైట్రోజన్ గ్యాస్ పీల్చుకుని యువకుడు ఆత్మహత్య

By

Published : Mar 2, 2021, 12:24 PM IST

హైదారాబాద్​ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నైట్రోజన్ గ్యాస్ పీల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ రామ వర్మ (25), ఈ నెల 26న మాసబ్ ట్యాంక్​లోని ఓ హోటల్ రూమ్​లో దిగాడు. 27న బయటకు వెళ్లి మధ్యాహ్నం హోటల్ గదిలోకి వచ్చాడు.

నైట్రోజన్ గ్యాస్ సిలిండర్ తెచ్చుకుని దాని పైప్​ను నోట్లో పెట్టుకొని... ముఖానికి కవర్ చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజులు గడుస్తున్నా బయటకు రాకపోవడంతో... గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వర్మ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. వర్మ మానసిక ఒత్తిడికి లోనయ్యేవాడని విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.

ఇదీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details