యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన శివ కిషోర్(26) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి విపరీతంగా నొప్పి రావడంతో భరించలేక రైలు కింద పడి మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు.
Suicide: నొప్పి భరించలేక.. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య - yadadri bhuvanagiri district latest news
కడుపు నొప్పిని భరించలేక రైలు కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
మృతుడు భువనగిరిలోని ప్రైవేట్ బ్యాంకు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Murder : తల్లీకూతుళ్ల దారుణ హత్య.. అల్లుడే హంతకుడు!