Young Man Committed Suicide : 'ఆమె టైమ్‌పాస్ ప్రేమ వల్ల పిచ్చోడినయ్యా.. నాపై ప్రేమ నటిస్తూ ఓ లెక్చరర్‌తో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతోంది. అబ్బాయిలు మోసం చేస్తే హైలైట్ చేస్తారు. అదే అమ్మాయిలు చేస్తున్న మోసాన్ని సమాజం ఎందుకు ప్రశ్నించదు' అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. విజయవాడ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆమె టైమ్ పాస్ ప్రేమతో పిచ్చోడినయ్యా.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్ - AP highlights
Young Man Committed Suicide : ప్రేమిస్తే ప్రాణమిస్తానని నమ్మించిన ఆ యువతి మాటలకు ఆకర్షితుడయ్యాడు. అన్నీ ఆమేనని అనుకున్నాడు. అయితే అమ్మాయి తనపై ప్రేమను నటిస్తూనే మరొకరితో మాట్లాడటం తెలుసుకుని తట్టుకోలేకపోయాడు. చివరికి ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. తనకు జరిగిన మోసాన్నంతా వివరిస్తూ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
కృష్ణలంకకు చెందిన అబ్దుల్ సలాం(19) కానూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తనను ప్రేమించినట్లు నటిస్తూ మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి వన్‌టౌన్ నైజాం గేటు సెంటర్ సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ లేఖను జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ పార్థసారథి తెలిపారు. ఆదివారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇవీ చదవండి: